తెలంగాణ రాష్ట్ర పోలీసుశాఖలో భారీ ఎత్తున నియామకాలు చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. ఇందులో భాగంగా నియామకాలకు సంబంధించిన దస్త్రాలు ఆర్థికశాఖకు చేరాయి. ఇక్కడ ఆమోదం లభించగానే నియామక ప్రకటనను విడుదల చేయాలని అధికారులు యోచిస్తున్నారు. దాదాపు తొమ్మిది వేల ఉద్యోగాల భర్తీకి కసరత్తు జరుగుతోంది. నెల రోజుల్లో ఈ ప్రక్రియ ఓ కొలిక్కి రావచ్చని భావిస్తున్నారు.
వీలైనంత త్వరగా పోలీస్ శాఖకు దాదాపు 1,600 ఇన్నోవాలు, 1,550 ఇతర వాహనాలను సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. వీటన్నింటికీ డ్రైవర్లు అవసరం కాబట్టి... ఇప్పటికే అదనంగా 3,200 డ్రైవర్ పోస్టులను మంజూరు చేసింది. దీంతో వీటి భర్తీకి సంబంధించిన దస్త్రాన్ని అధికారులు ఆర్థికశాఖకు పంపారు. దాదాపు ఆరువేల కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాల భర్తీకి సంబంధించిన దస్త్రం కూడా ఆర్థికశాఖకు చేరింది. ఆగస్టు నెలాఖరుకు నోటిఫికేషన్ విడుదల కావచ్చని భావిస్తున్నారు.

0 comments:
Post a Comment