ఇంటర్ అర్హతతో బీఈడీ!
ఇక మీదట ఇంటర్ పూర్తికాగానే బీఈడీలో చేరవచ్చు. దీనికి అనుగుణంగా కేంద్రప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. 'నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ (నాక్) నిబంధనల మేరకు సమీకృత కోర్సుగా బీఈడీని మార్చాలని అన్ని విశ్వవిద్యాలయాల వీసీలకు యూజీసీ ఆదేశాలు జారీ చేసింది. నాక్ నిబంధనల మేరకు మార్చడం అంటే.. బీఈడీని బీఏ, బీఎస్సీతో సమానంగా పరిగణించడమని పేర్కొంది. కేంద్ర మానవ వనరులశాఖ మంత్రి స్మృతీఇరానీ ఆదేశాల మేరకు యూజీసీ ఈ సూచన చేసింది. ప్రస్తుతం బీఈడీలో చేరాలంటే బీఏ/బీఎస్సీ పూర్తిచేసి ఉండాలన్న విషయం తెలిసిందే. ఈ విధానాన్ని యూజీసీ నిరాకరిస్తూ.. ఇంటర్మీడియట్ స్థాయి పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు బీఈడీలో ప్రవేశం కల్పించేలా చర్యలు చేపట్టాలని వీసీలకు స్పష్టం చేసింది. ఈ మేరకు బీఈడీని ఒక కొత్త సమీకృత కోర్సుగా అందించేలా 'ఎడ్యుకేషన్ విభాగాన్ని' ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. 57 రాష్ట్రస్థాయి, 20 కేంద్రస్థాయి విశ్వవిద్యాలయాలకు యూజీసీ ఈ ఆదేశాలను జారీ చేసింది. భారీఎత్తున ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీని నిలబెట్టుకోవడం కోసమే ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం.. ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కొత్త బీఈడీ కోర్సులకు అవసరమైన పాఠ్యప్రణాళికను సిద్ధం చేయడానికి యూజీసీ ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది.

0 comments:
Post a Comment