* 16న తేలనున్న ఫీజురీయింబర్స్‌మెంట్ వ్యవహారం* జులై 20 నాటికి ప్రవేశ ప్రకటనకు అధికారుల కసరత్తు
ఇంజినీరింగ్, ఇతర వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ ప్రక్రియ జులై నెలాఖరుకు ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది. జులై 20 నాటికి ప్రవేశ ప్రకటన విడుదలచేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇంజినీరింగ్, ఇతర వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ ప్రక్రియ జులై నెలాఖరుకు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఫీజు రీయింబర్స్‌మెంట్ వ్యవహారం కూడా మరో రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. స్థానికత వ్యవహారంలో ప్రామాణిక సంవత్సరం విషయంలోనూ జులై 16 నాటి కేబినెట్ సమావేశంలో స్పష్టత రానుంది. స్థానికత అంశంపై మొదట 1956 నిబంధన మూలంగా చాలామందికి అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం కావడంతో ప్రభుత్వం 1956 కు బదులుగా 1974ను ప్రామాణిక సంవత్సరంగా తీసుకువచ్చే అంశంపై కేసీఆర్ అధికారులతో చర్చించారు. ఫీజురీయింబర్స్ వ్యవహారంలో స్పష్టత రాగానే కౌన్సెలింగ్ ప్రకటన జారీ చేయాలని అధికారులు భావిస్తున్నారు. కొత్త నిబంధనలను రెండు మూడురోజుల్లో తీసుకొస్తే ఎంసెట్ కౌన్సెలింగ్ తేదీలతోపాటు ఇతర ఉన్నత విద్య కోర్సులకు కౌన్సెలింగ్ తేదీలను ప్రకటించడానికి అవకాశం ఉంటుంది.

0 comments:
Post a Comment