Tuesday, 15 July 2014

ఆన్‌లైన్‌లో ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్ష ద‌ర‌ఖ‌స్తులు, ఫీజు చెల్లింపు

ప్రభుత్వ ప‌రీక్షల విభాగం క‌స‌ర‌త్తు
 
ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్ష ద‌ర‌ఖాస్తు, ఫీజు చెల్లింపు ప్రక్రియ‌ల‌న్నీ కూడా ఆన్‌లైన్ ద్వారానే జ‌రిపేలా ప్రభుత్వ ప‌రీక్షల విభాగం ఏర్పాట్లు చేస్తుంది. ఇంతకుముందు వరకు ప్రభుత్వ, ప్రైవేట్‌, ఎయిడెడ్ పాఠ‌శాల‌ల్లో చ‌దువుతున్న ప‌దోత‌ర‌గ‌తి విద్యార్థుల నామిన‌ల్ రోల్స్‌, ఫీజు ద‌ర‌ఖాస్తుతో కూడిన వివ‌రాల‌ను సంబంధిత పాఠ‌శాల యాజ‌మాన్యాలు జిల్లా విద్యాశాఖ కార్యాల‌యంలో స‌మ‌ర్పిస్తే, వీటిని జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రభుత్వ ప‌రీక్షల విభాగానికి పంపిస్తారు. వాటిని స్కానింగ్ చేసి ప్రభుత్వ ప‌రీక్షల విభాగం ఆన్‌లైన్‌లో పెడుతుంది. ఒక‌వేళ నామిన‌ల్ రోల్స్ వివ‌రాల్లో ఏమైనా త‌ప్పులు దొర్లితే మ‌రోసారి వాటిని సరిదిద్దుకోవ‌డానికి అవ‌కాశం ఇచ్చేవారు. ఇప్పటి నుంచి ఈ పద్ధతికి స్వస్తి చెప్పి నేరుగా ఆన్‌లైన్ ద్వారా విద్యార్థుల వ్యక్తిగ‌త వివ‌రాలు, ఫీజు చెల్లింపులు జ‌రిగేలా చ‌ర్చలు తీసుకుంటున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రక్రియ పూర్తయిన‌ట్లు ప్రభుత్వ ప‌రీక్షల విభాగం అధికారులు తెలిపారు.
Share:

0 comments:

Post a Comment

Copyright © Resultsking | Powered by Atozmp3 Design by Chirra Shoban Babu | Blogger Theme by Resultsking.com